Friday, November 22, 2024

ఆదుకునే వాడేరా పోలీస్….

ప్రజా సేవలో రాష్ట్ర పోలీసులు
కొవిడ్‌ బాధితులకు అండదండలు
ప్లాస్మాతోపాటు భోజనం వరకు
అన్నింటిలోనూ ముందు
హైదరాబాద్‌, : నేరం చేసిన వారి పట్ల కఠి నంగా వ్యవహరించడమే కాదు, ఆపదలో ఉన్న వారిని ఆదు కోవడంలోనూ ముందుంటామని తెలంగాణ పోలీసులు నిరూపించుకుంటున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ కరాళనృత్యం చేస్తున్న తరుణంలో ఎన్నో కుటుంబాలు ఆదుకునే ఆపన్న హస్తంకోసం ఎదురు చూస్తున్నాయి. అలాంటి వారికి మేము న్నామంటూ పోలీసులు ముందుకు వస్తున్నారు. ఖాకీల వెనుక క్రౌర్యం ఎంతుంటుందో దయార్థహృదయం కూడా అంతకంటే ఎక్కువ ఉంటుందని తాజా పరిస్థితుల నేప థ్యం లో రాష్ట్రంలో పోలీసులు చేస్తున్న సేవలు నిరూపిస్తు న్నాయి. దాతల సహాయంతో రాష్ట్ర పోలీసు శాఖ కోవిడ్‌ బారిన పడిన వారితో పాటు వారిపై ఆదారపడిన వారికి కూడా కావాల్సిన సహాయాన్ని అందిస్తున్నారు.
కోవిడ్‌తో అనారోగ్యానికి గురైన వారికి అంబులెన్స్‌లను ఉచి తంగా సమకూర్చడం, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అవ సరమైన వారికి కావాల్సిన ప్లాస్మా దాతలను చూపించి వారి ద్వారా రక్తాన్ని ఇప్పించడంతో పాటు రెమిడెసివర్‌ లాం టి ఇంజక్షన్‌లను కూడా ఆస్పత్రుల సూచనల మేరకు కొంత మందికి పోలీసులు సమకూరుస్తున్నారు. సిబ్బంది సంర క్షణపై దృష్టి పెడుతూనే ప్రజా క్షేమం అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం పలువురి ప్రశంసలను అందు కుంటు న్నా రు. ప్లాస్మా కావాల్సిన వారికి ఎలాంటి ఇబ్బం దులు ఎదు రవ కుండా ఉండేందుకు పోలీసులు ఎక్కడికక్కడ ప్లాస్మా బ్యాం క్‌లను ఏర్పాటు చేశారు. కోవిడ్‌ సోకి తగ్గిన వారి వివరాలను సేకరించిన పోలీసులు మరొకరికి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను నిలిపిన వారవుతారంటూ తెలిపి ప్లాస్మాను దానం చేసేలా కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఇలా పోలీసులు రోజుకు కనీసం 100 మందికి ప్లాస్మాను దాతల ద్వారా సమకూరుస్తున్నారు.
ఇంటికే భోజనం ప్యాకెట్లు
కోవిడ్‌ సోకి ఐసోలేషన్‌లో ఉన్న వారు కోరితే ఇంటి వద్ద కే భోజనం ప్యాకెట్లను అందించాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణ యించింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థల సహాయంతో ఇం టి కే భోజనం పంపేలా ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌ సోకిన వారె వరై నా పాజిటివ్‌ అని నిరూపించే పత్రంతో పాటు పేరు. ఇంటి చిరునామా, వాట్సప్‌ నంబర్‌ 7799616163కి తెలియజేస్తే స్వి గ్గి, బిగ్‌ బాస్కెట్‌, హోప్‌ తది తర సంస్థల ద్వారా ప్యాకింగ్‌ చేసి న పౌష్టికాహారంతో కూడిన భోజ నాన్ని అందించాలని నిర్ణం ుుంచారు. ఇలా నిత్యం వెయ్యి నుంచి రెండు వేల మం దికి ప్యాకెట్లను అందించేందుకు పోలీసు శాఖ సన్నద్దమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement