జులై మొదటి వారంలో షెడ్యూల్
అదే నెల చివరి వారంలో నోటిపికేష్
ఆగస్ట్ 10 తేదీన ఓకే విడతలో పోలింగ్
12,814 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు
తెలంగాణలో కొద్ది రోజుల క్రితమే లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఇక.. రాష్ట్రంలో అతి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.. అనధికార సమచారం ప్రకారం జూన్ మొదటి వారంలో వార్డుల విభజన.. రెండో వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మూడో వారంలో సర్పంచ్లకు రిజర్వేషన్ ప్రక్రియ.. జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు సమాచారం అందుతోంది.
ఆగస్టు 10 లోపు ఎన్నికలు..
షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 2 లోపు ఎన్నికల నిర్వహణ జరగనుండగా.. ఆగస్టు 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్టు సమాచారం. మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్.. 2 గంటల తర్వాత కౌంటింగ్.. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. తెలంగాణలో మొత్తం 12,814 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.