హైదరాబాద్ – తెలంగాణలోని మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారుల పాలన నేటి నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీల్లో పాలక మండళ్ల గడువు ఆదివారంతీఓ ముగిసింది. దీంతో ఆ పురపాలికల్లో పాలన కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ జీవో 15 విడుదల చేశారు. నస్పూర్, కొత్తపల్లి మంచిర్యాల మున్సిపాలిటీలు కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనమైనందున 128 మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన అమల్లోకి తెస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ నెల 28 నుంచి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. .
ప్రస్తుతం రాష్ట్రంలో 139 మున్సిపాలిటీలు, 16 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 7 మున్సిపాలిటీలు మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీలకు మాత్రం 2021లో ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు మున్సిపాలిటీలు ఏజెన్సీ పరిధిలో ఉన్న పాల్వంచ, మణుగూరు, మందమర్రి, జహీరాబాద్‌లకు ఎన్నికలు నిర్వహించలేదు. ఇక సర్పంచ్ ల గడుపు ముగియడంతో గ్రామపంచాయితి మండళ్ల ఇప్పటికే రద్దు అయ్యాయి. ఇప్పటికే గ్రామాల్లో కూడా ప్రత్యేక అధికారుల పాలన అందుబాటులోకి ఉంది.