Monday, November 25, 2024

Telangana – నోటాకి ఓటేయ‌డంపై త‌గ్గిన ఆస‌క్తి


లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌గ్గిన నోటా షేర్‌
ఈసారి కేవ‌లం 27,861 ఓట్లు మాత్ర‌మే
2019లో నోటాకి ప‌డ్డ‌వి 41,840 ఓట్లు
గ్రేట‌ర్ ప‌రిధిలో మ‌ల్కాజిగిరిలో 13వేలు
హైద‌రాబాద్‌లో అత్య‌ల్పంగా కేవ‌లం 2,906

ఓట‌ర్ల‌లో చైత‌న్యం వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్ర‌తి ఎన్నిక‌ల్లో లీడ‌ర్ల తీరుపై విసుగు చెందిన ఓట‌ర్లు వారి ఓటును నోటాకి గుద్దేస్తుంటారు. దీంతో గెలుపు ఓట‌ముల విష‌యంలో కాస్త తేడాలొస్తుంటాయి. కానీ, ఈ సారి జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అసెంబ్లీ కంటే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు చైత‌న్య‌వంతులైన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. అందులో రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో అయితే నోటాకి చాలా త‌క్కువ‌గా ఓట్లు ప‌డ్డ‌ట్టు ఎన్నిక‌ల సంఘం లెక్క‌లు చెబుతున్నాయి.

హైద‌రాబాద్‌లో 2వేల ఓట్లే..

- Advertisement -

శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభలో నన్‌ ఆఫ్‌ ది ఎబౌ (నోటా) ఓట్లు పెద్దగా ప్రభావం చూపించలేదు. గ్రేటర్‌ పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో కలిపి నోటాకు 27,861 ఓట్లు పోలయ్యాయి. గత లోక్‌సభతో పోలిస్తే ఈసారి నోటా ఓట్లు బాగా తగ్గాయి. 2019లో నోటాకు 41,840 ఓట్లు పోలయ్యాయి. ఓటర్లు నోటాకు బదులు నచ్చిన అభ్యర్థికే ఓటు వేయడమే ఈ తగ్గుదలకు కారణం. గ్రేటర్‌ పరిధిలో తాజా ఎన్నికల్లో అత్యధికంగా మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్‌లో 13,366 నోటా ఓట్లు పడగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో కేవలం 2,906 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నోటాకు 17,979 ఓట్ల తేడా వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement