Monday, November 18, 2024

కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చూపినా…ఆగ‌ని ప్ర‌గ‌తి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలం గాణకు కేంద్ర సాయం, గ్రాంట్లలో నానాటికీ దిగదు డుపే అన్నట్లుగా పరిస్థితి మారు తోంది. ఇదే అంశం మరోసారి రుజు వైంది. ఈ ఆర్థిక ఏడాది తొలి రెండు నెలల్లోనే పన్నుల వాటా కుదింపు దిశగా కేంద్రం కుయుక్తులకు దిగు తోందనే విమర్శలు, రాష్ట్రాలకు ఇబ్బందులు మరిం తగా పెరుగుతున్నాయి. ఎన్నికల ఏడాదిలో కూడా కేంద్రం వెనుకకు తగ్గడం లేదని స్పష్టమవుతున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతినెలా ఇవ్వాల్సిన ఆర్థిక సాయాలు, హక్కుగా ఇవ్వాల్సిన పన్నుల వాటాను కేంద్రం దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న అంచనాలు గతి తప్పడంతోనే ప్రత్యా మ్నాయ మార్గాల్లో వనరుల సమీకరణ చేసుకోవా ల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్ప టికీ రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ పరిమితిని మించి అప్పులు చేయలేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణపై పలు ఆర్థిక సాయాలు, సహకారాల్లో కేంద్రపు కోతలు స్పష్టంగా కావాలని చేస్తున్న నిర్లక్ష్యమేనని స్పష్టం చేస్తున్నాయి.

2014-15లో గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి రూ.21,720 కోట్లు అంచనా వేయగా, కేంద్రం విడుదల చేసింది రూ.64 87 కోట్లే కావడం గమనార్హం. అయితే పోనీ క్రమేణా రానురానూ విడుదలలో కేంద్రం ఏమన్నా పెద్దన్న పాత్ర పోషించిందా అంటే ఈనాటి వరకు ఇదే తీరు కొనసాగిస్తూ వచ్చింది. 2015-16లో రూ.12,400 కోట్ల అంచనాలకు రూ.7,550 కోట్లు విడుదల చేసింది. 2016-17లో రూ.14,557 కోట్లు గానూ రూ.9,074 కోట్లు, 2017-18లో రూ.26,857 కోట్ల అంచనాకు గానూ కేవలం రూ.8,041 కోట్లు విదిల్చి కేంద్రం చేతులు దులుపుకుంది. 2018-19లో రూ.29,041 కోట్ల అంచనాలకు గానూ రూ.8,177 కోట్లు, 2019- 20లో అంచనా రూ.8,177 కోట్లు ఉండగా గుడ్డిలో మెల్ల అన్నట్లుగా రూ.11,598 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2020-21లో కూడా రూ.10,525 కోట్ల అంచనాలకు గానూ రూ.15,471 కోట్లు విడుదల చేయడం గమనార్హం. 2021-22లో మళ్లిd రూ.38, 669 కోట్ల అంచనాకు రూ.8,619 కోట్లు, 2022-23లో 41 వేల కోట్ల అంచనాలకు రూ.13,087 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది రూ.41,259 కోట్లు అంచనా వేసుకోగా సగం కూడా వచ్చే పరిస్థితిలేదని తెలుస్తోంది.

కేంద్ర నిర్లక్ష్యపు విధానాలు ఎలా ఉన్నా… అభివృద్ధి పథంలో పయణిస్తున్న తెలంగాణ వ్యయా ల్లో సింహభాగం సంక్షేమానికే ఖర్చు చేస్తున్నది. ఇక పన్నుల వాటాలోనూ తెలంగాణ పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమనే చూపిస్తోంది. 2022-23 లో కేంద్ర పన్నుల వాటాగా రూ.18 వేల కోట్ల అంచనాలను రూ.12,407 కోట్లకు కేంద్రం కుదిం చింది. గతేడాది బడ్జెట్‌ రూ.2.56 లక్షల కోట్లలో 77శాతం రూ.1.98 లక్షల కోట్లను అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ఖర్చు చేసింది. ప్రభుత్వానికి వచ్చిన ప్రతి పైసా నిధులను సక్ర మ మార్గంలో వెచ్చించి రాష్ట్ర సంపద పెంపులో తెలం గాణ సర్కార్‌ విజయం సాధించింది. అందుకే దేశం లోనే తలసరిలోనూ, జీఎస్‌డీపీలోనూ అగ్రగా మిగా స్థానం సాధించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో నిధులను ఇప్పటికే దాదాపు 890శాతం విడుదల చేసి తన ఔదార్యాన్ని కేంద్ర ప్రభుత్వం చాటుకోగా, బీజేపీయేతర ప్రభుత్వాలపై కావాలనే కుయుక్తులు పన్నుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గుజ రాత్‌కు గ్రాంట్లు 79.15శాతం, కర్నాటకకు 66శాతం, కేరళ, పంజాబ్‌ మహారాష్ట్రలకు కూడా భారీగానే నిధులను విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement