తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.అలాగే ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా బి.బాల మాయదేవిని నియమించారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆమె స్థానంలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిగా ఇ.నవీన్ నికొలస్‌ను నియమించారు..
సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా ఎం.హన్మంతరావు, ఉద్యానవన డైరెక్టర్‌గా కె.అశోక్‌రెడ్డిని నియమించారు. ఫిషరీస్ కమిషనర్‌గా బి.గోపీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఎ.నిర్మల కాంతి వెస్లీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె ప్రస్తుతం మహిళ ఆర్థిక సంస్థ ఎండీగా కూడా కొనసాగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శిగా కె.సీతాలక్ష్మీని నియమించారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా ఫణీంద్ర రెడ్డిని నియమించారు. ఐఎఫ్‌ఎస్ అధికారి వీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌ను సివిల్ సప్లయిస్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు