Friday, November 8, 2024

Telangana – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కొత్త ఉప కులపతుల భేటి

హైదరాబాద్ – :కొత్తగా నియమితులైన రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమావేశమయ్యారు. ఉన్నత విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో విద్యారంగంలో తీసుకురావాల్సిన ఆవిష్కరణలు, సంస్కరణలపై సమావేశం చర్చించింది.

ఈ సందర్భంగా ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారం గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ సహకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకొచ్చేలా కృషి చేస్తానని అన్నారు. సమావేశంలో పాల్గొన్న ఇతర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు విద్యారంగ అభివృద్ధి, విద్యార్థులకు ఉత్తమ నైపుణ్యాలను అందించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.

. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఐ. పురుషోత్తం ఆయా విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement