Monday, November 25, 2024

Telanganaకు కొత్త రైల్వే లైన్.. ₹24,657 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్

ప్రధాని మోదీ సంకల్పానికి సాక్ష్యం అంటూ ప్ర‌శంస
మల్కన్‌గిరి నుండి భద్రాచలం వరకు ₹4,109 కోట్లతో కొత్త లైన్​
ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టెవిటే పెరిగే చాన్స్​
హర్సం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి బండి సంజ‌య్

ఆంధ్రప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్ : తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఈ నిర్ణయం నిదర్శనమ‌న్నారు. నిన్న ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర సహా పశ్చిమ బెంగాల్‌లోని 7 రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేసే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

24,657 కోట్ల అంచ‌నా..

- Advertisement -

ఈ నిర్ణయంపై బండి సంజయ్ శనివారం స్పందించారు. ₹24,657 కోట్ల అంచనా వ్యయంతో, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఈ కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఇందులో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుండి భద్రాచలంలోని పాండురంగాపురం వరకు ₹4,109 కోట్లతో 200.60 కి.మీ పొడవున కొత్త లైన్‌ను నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ లైన్ పూర్తి చేసి అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement