తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గెజిట్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అందించారు. దీంతో పాత శాసనసభ రద్దై కొత్త శాసనసభ కొలువు తీరనుంది. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాజ్ భవన్ చేరుకొని ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందించారు. గెలుపొంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందించారు.
►తెలంగాణలో మూడో శాసన సభ ఏర్పాటకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
►పాత అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన రాజ్‌భవన్
►ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళిసైకు సమర్పించిన సీఈవో వికాజ్‌రాజ్
►119 మంది ఎమ్మెల్యేల ఎంపికను ధృవీకరించిన గవర్నర్
►గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్
►గెజిట్ ను గవర్నర్ కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి
►అంతకు ముందు అసెంబ్లీ రద్దు ప్రతులను అందించిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి
► ఇక కొలువుదీరనున్న కొత్త శాసనసభ