వికారాబాద్ (ప్రభ న్యూస్):తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 14న ఉదయం 11:00 గంటలకు ఛలో బస్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. వికారాబాద్ టీఎస్ఆర్టీసీలో వెంటనే వేతన సవరణలు చేయాలని, యూనియన్ ఎన్నికలు జరపాలని,ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వికారాబాద్ డిపో ముందు ధర్నా నిర్వహించారు. మిగిలిన డీఏలను చెల్లించాలని, 2013కు సంబంధించిన వేతన సవరణ 50 శాతం బాండు డబ్బులను చెల్లించాలని,పెంచిన పనిభారాన్ని తగ్గించాలని, యాజమాన్యం వేధింపులు మానుకోవాలని టీ జే ఎం యు జనరల్ సెక్రటరీ హన్మంత్ ముదిరాజ్ కార్మికులకు పిలుపు నిచ్చారు అదేవిధంగా భోజన విరామ సమయంలో ఎర్ర రిబ్బన్ లు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీకే రెడ్డి, సుదర్శన్, అనంతయ్య, వసంత్, ఆంజనేయులు, లక్ష్మణ్, అమర్నాథ్, ఖాజా, భూషణమ్, నర్సిములు ఎంఎన్ రావు జనార్దన్, వినోద్, అంజి, బాలయ్య మరియు వికారాబాద్ డిపో కార్మికులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement