కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న తరుణంలో గత 10 రోజుల సమయంలోనే 15 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించడం కలవరపెడుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమైంది. ఇటీవల కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు రెండు లక్షల ఆర్థిక సహాయం కోసం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి కార్యాలయానికి మే, 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో కరోనా మరణ ధృవీకరణ పత్రము, అక్రిడిటేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టులతోపాటు ఆయా జిల్లాల డి.పి.ఆర్.ఓ.లు ధృవీకరించవలసి ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement