Sunday, November 3, 2024

Telangana Lok Sabha 17 seats – లీడ్స్ – కాంగ్రెస్ 7, బిజెపి 8 బి ఆర్ ఎస్ 1 …. ఎంఐఎం 1

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు కొనసాగుతున్నది… కాంగ్రెస్ 8, బిజెపి 8, ఎఐఎం 1 ఒక స్థానంలో అధీక్యంలో ఉన్నాయి

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు గాను బీజేపీ 8, కాంగ్రెస్ 7 స్థానాల్లో, మజ్లిస్ , బిఆర్ ఎస్ లు ఒక్కొ స్థానంలో ముందంజలో ఉన్నాయి. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యంలో నిలిచారు.

ల‌క్ష ఆధిక్యంలో.. ఆ ముగ్గురు

తెలంగాణ లోక్​సభ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. కాంగ్రెస్​, బీజేపీ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ఆధిక్యం సాధిస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో రౌండ్ రౌండ్ కు ఓట్ల ఆధిక్యత పెరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ముగ్గురు అభ్యర్థులు లక్ష ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు లక్షకు పైగా ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రామసహాయం రఘురామ్ రెడ్డి (ఖమ్మం), కుందూరి రఘువీర్ (నల్గొండ), బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ (మల్కాజిగిరి) కూడా లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రౌండ్ రౌండుకు పెరుగుతున్న ఓట్ల ఆధిక్యం
రఘురామిరెడ్డి 1,48,091 ఓట్ల ఆధిక్యం, కుందూరి రఘువీర్ రెడ్డి 2,12,695 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా మారాయి. మల్కాజగిరిలో ఈటల 1,05,472 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

బీజేపీ అభ్యర్థుల ముందంజ
ఆదిలాబాద్ లో గోడం నగేశ్ (బీజేపీ), చేవేళ్లలో విశ్వేశ్వర్ రెడ్డి 33,086 ఓట్లు, కరీంనగర్ లో బండి సంజయ్ 64,406 ఓట్లు,సికింద్రాబాద్ లో జి కిషన్ రెడ్డి 34,076 ఓట్లు, నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్ 17,832 ఓట్లు, మహబూబ్ నగర్ లో డీకే అరుణ 5,652 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఆధిక్యంలో అధికార కాంగ్రెస్ అభ్యర్థులు
భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి 48,622 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 82,286 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థులు నాగర్ కర్నూల్ లో మల్లు రవి 18,655 ఓట్ల ఆధిక్యంలో, పెద్దపల్లిలో గడ్డం వంశీ కృష్ణ 27,283 ఓట్లు, వరంగల్ లో కడియం కావ్య 48,790, జహీరాబాద్ లో సురేశ్ షెట్కార్ మందుంజలో ఉన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వా? నేనా అన్నట్లు బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటాపోటీగా రౌండ్ రౌండుకు ఫలితాలు మారుతున్నాయి.

అధీక్యంలో ఉన్న బిజెపి అభ్యర్ధులు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), గోడం నగేశ్‌ (ఆదిలాబాద్‌), బండి సంజయ్‌ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్‌), కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్‌ నగర్), భరత్‌ ప్రసాద్‌ (నాగర్‌ కర్నూల్‌) ఆధిక్యంలో ఉన్నారు.

అధీక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధులు

ఖమ్మం లోక్‌సభ స్థానంలో రఘురామిరెడ్డి (కాంగ్రెస్) 55,564 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి), సురేశ్‌ షెట్కార్ (జహీరాబాద్‌), చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (భువనగిరి), బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌), రఘువీర్‌ రెడ్డి (నల్గొండ), కావ్య కడియం (వరంగల్‌) కాంగ్రెస్ తరఫున ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) ఆధిక్యం కనబరుస్తున్నారు. భారాస మెదక్‌ స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీ తరఫున వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు.

కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌,
మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యం.. మల్కాజిగిరి పార్లమెంట్: కౌంటింగ్ ప్రారంభం ఈటలకు 18,546 ఫస్ట్ రౌండ్ లో లీడ్
మొదటి రౌండ్లో వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ 242 ఆధిక్యం
తెలంగాణలో బీజేపీ కీలక నేతలు కిషన్ రెడ్డి,
బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్,
డీకే అరుణ తదితరులు ముందంజలో ఉన్నారు.

చేవెళ్ల పార్లమెంట్ ఓటింగ్ కౌంటింగ్ అప్డేట్స్ 1st, Round ముగిసే సమయానికి..! అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్:- 818 , బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి:- 3773 , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి:- 3214 ముందంజలో l బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి559 ఆధిక్యం
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లో కాంగ్రెస్ ఆధిక్యం .. మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కవ్య 8404ఓట్ల ఆధిక్యం నల్లగొండ లోక్ సభ తొలి రౌండ్. మొత్తం ఓట్లు : 64862. కాంగ్రెస్ : 37984. బిఆరెస్ : 11796. బీజేపీ : 10970.
కాంగ్రెస్ అధిక్యం : 26188.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో పోస్టల్ , హోమ్ ఓటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి పోరిక బలరాం నాయక్ 1907 ఓట్లు ఆధిక్యం.

కాంగ్రెస్ అభ్యర్థులు… నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, ఖమ్మం నుంచి రఘురామిరెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, నాగర్ కర్నూలు, భువనగిరి నియోజకవర్గాలలోను కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ పోటాపోటీ కనిపిస్తోంది.

బీజేపీ అభ్యర్థులు… వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్, ఆదిలాబాద్ నుంచి గోడం నగేశ్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ ముందంజలో ఉన్నారు.

మల్కాజిగిరి: ఈటల రాజేందర్ బీజేపీ 05,472 ఆధిక్యం
మెదక్‌: రఘునందన్‌ రావు (బీజేపీ) 1731 ఆధిక్యం
నాగర్‌ కర్నూల్‌: మల్లు రవి (కాంగ్రెస్) 18,655
నల్గొండ: కుందురు రఘువీర్‌ రెడ్డి (కాంగ్రెస్) (1,42,695)
నిజామాబాద్‌: ధర్మపురి అర్వింద్ (బీజేపీ) 17,832 ఆధిక్యం
పెద్దపల్లి: గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 27, 283 ఓట్ల ఆధిక్యం
సికింద్రాబాద్: జి కిషన్‌ రెడ్డి (బీజేపీ) 34,076 ఓట్ల ఆధిక్యం
వరంగల్‌: కడియం కావ్య (కాంగ్రెస్) 48,790 ఓట్ల ఆధిక్యం
జహీరాబాద్‌: సురేశ్‌ షెట్కార్ (కాంగ్రెస్) 12,368 ఓట్ల ఆధిక్యం
ఆదిలాబాద్‌: గోడం నగేశ్‌ (బీజేపీ) 38,283 ఆధిక్యం
భువనగిరి: చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్) 48,622 ఓట్ల ఆధిక్యం
చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (బీజేపీ) 33,086 ఆధిక్యం
హైదరాబాద్‌: అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) 33,009 ఓట్ల ఆధిక్యం
కరీంనగర్: బండి సంజయ్ (బీజేపీ) 64,408 ఆధిక్యం
ఖమ్మం: రామసహాయం రఘురామ్‌ రెడ్డి (కాంగ్రెస్‌) 1,48,091 ఆధిక్యం
మహబూబాబాద్‌: బలరాం నాయక్‌ (కాంగ్రెస్) 82,286 ఆధిక్యం
మహబూబ్‌ నగర్‌: డీకే అరుణ (బీజేపీ) 5,652 ఆధిక్యం

భారీ విజయం దిశగా నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి…

Advertisement

తాజా వార్తలు

Advertisement