హైదరాబాద్ : కృష్ణ జలాలను కేసీ కెనాల్‌కు తరలించాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోందని, నీటి తరలింపును నిలిపివేయించాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం నాడు తుంగభద్ర బోర్డుకు లేఖ రాశారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ఒకటి, రెండు అవార్డుల ద్వారా అనుమతించిన దానికంటే ఎక్కువ నీటిని తరలించేందుకు యత్నిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ఒకటో అవార్డు కేసీ కెనాల్, తుంగభద్ర రైట్ బ్యాంక్ హైలెవెల్ కెనాల్, రైట్ బ్యాంక్‌లో లెవెల్ కెనాల్ తుంగభద్ర డ్యామ్ నుంచి మాత్రమే తుంగభద్ర నీటిని ఉపయోగించాలని నిర్దేశించిందని, కానీ, ఏపీ మాత్రం కృష్ణా నీటిని కేసీ కెనాల్‌కు వినియోగిస్తుందని ఆరోపించారు. సుంకేశుల ద్వారానే తుంగభద్ర జలాలను వినియోగించాలని, కేసీ కెనాల్‌కు కృష్ణా జలాల తరలింపును నిలిపివేయించాలని తుంగభద్ర బోర్డు కార్యదర్శిని తెలంగాణ ఈఎన్సీ కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement