Friday, November 22, 2024

Telangana వార్షిక నివేదిక‌లు ఎక్క‌డ‌…. రేవంత్ ను నిలదీసిన కెటిఆర్..

మేం ప్ర‌తి ఏటా విడుద‌ల చేశాం..
ప్ర‌జ‌ల‌కు ఏమీ చెప్ప‌కుండా ఉండ‌ట‌మే ప్ర‌జా పాల‌న‌
జ‌వాబుదారి త‌నం కాంగ్రెస్ పాల‌నలో క‌నుమరుగు
ట్విట్ట‌ర్ వేదిక‌గా కెటిఆర్ కాంగ్రెస్ పాల‌న‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం

హైద‌రాబాద్ : “ప్రజా ప్రభుత్వం” అంటూ మాటలేమో కోటలు దాటుతున్నాయ‌ని,.. ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండడానికి చేయాల్సిన పనులేమో అసలు మొదలేకావు అని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండి ప‌డ్డారు.. వార్షిక నివేదికలు విడుదల చేసి, తమ చర్యల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడం శోచనీయం అని అన్నారు..

- Advertisement -

ఈ మేర‌కు కెటిఆర్ ట్విట్ చేశారు… పాలనను పక్కనబెట్టి, చౌకబారు రాజకీయలు చేయడమే ప్రధాన పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పారదర్శకతను, జవాబుదారీ తనాన్ని, ప్రతీ సంవత్సరం ఠంచనుగా వార్షిక నివేదికలను ఆశించడం అత్యాశే అవుతుంది ఎద్దేవా చేశారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక 2014 నుంచి 2023 వ‌ర‌కు ప్ర‌తి ఏడాది ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డిపార్ట్‌మెంట్ల‌లో సాధించిన పురోగ‌తి వార్షిక నివేదిక‌ల‌ను విడుద‌ల చేయ‌డం సంప్ర‌దాయంగా కొన‌సాగింద‌ని గుర్తు చేశారు.. . ఈ నివేదిక‌లు ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ‌కు చేశాయ‌ని,. ప్ర‌తి ఏడాది జూన్ 2వ తేదీకి అటుఇటుగా వార్షిక నివేదిక‌ల‌ను విడుద‌ల చేసేవాళ్లం మ‌ని కేటీఆర్ పేర్కొన్నారు..

ఈ విభాగాలు ఏడాది కాలంలో ఏం ప్ర‌గ‌తి సాధించాయ‌నేది ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డ‌మే వార్షిక నివేదిక‌ల ఉద్దేశం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలు తమకు ఓటు వేసిన ప్రజలకు జవాబుదారీగా ఉంటాయన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని విరమించుకోవడం, 2023-2024 వార్షిక నివేదికలను విడుదల చేయకపోవడం విచారకరం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement