కరోనా క్లిష్ట సమయంలో సేవలు అందించాల్సిన జూనియర్ డాక్టర్లు మళ్లీ ఆందోళన బాట పడుతున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తామని జూడాలు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 15 శాతం స్టై ఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్న జూనియర్ డాక్టర్లు.. ప్రకటించిన విధంగా 10 శాతం ఇన్సెంటివ్స్ వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. ఇక, కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే… నిమ్స్ లో వైద్యం అందించేలా ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, కరోనా విధుల్లో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement