Monday, November 18, 2024

జర్నలిస్టులపై కరోనా పంజా!

కరోనా సెకండ్ వేవ్ జర్నలిస్టుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొంతమంది జర్నలిస్టులు చనిపోగా.. చాలామంది ఈ వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతూ నరకం అనుభవిస్తున్నారు.  జర్నలిస్టుల  ఆర్థిక  పరిస్థితులు బాగా లేక  ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్ళ లేక తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.  గవర్నమెంట్ హాస్పిటల్ లో సరైన వైద్య సౌకర్యాలు అందడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా జోక్యం  చేసుకొని కరోనాతో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు వెంటనే హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేకమైన వార్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ జర్నలిస్టు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అదేవిధంగా  జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ ఉన్న వారికి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరాయి. ప్రభుత్వం జర్నలిస్టు పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement