తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. 32 శాఖల్లో 45 వేలకుపైగా ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సర్కార్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది..మంగళవారం కేబినెట్ ఆమోదం తరువాత కొత్త జిల్లాలు, కొత్త జోన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఒకేసారి యాభైవేల ఉద్యోగాల భర్తీకి సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలను ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు సేకరించారు. ఉద్యోగాల భర్తీతో పాటు పదోన్నతులపైనా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: సమ్మేటివ్, ఫార్మేటివ్ పరీక్షల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు..