Friday, September 20, 2024

Telangana – రాజ‌కీయాలు ఆపండి… రిజ‌ర్వాయర్ల‌లో నీళ్లు నింపండి…..

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – గత 8 నెలలుగా తెలంగాణలో పాలన పడకేసిందని, . ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. ఢిల్లీలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాగునీటి రంగంలో ఘోరంగా విఫలమైందన్నారు. గత యాసంగి (రబీ) పంటకు నీళ్లు అందించలేకపోయిందని ఫైర్ అయ్యారు. గతంలో కేసీఆర్ పాలనలో యాసంగిలోనే భారీగా దిగుబడి వచ్చిందని తెలిపారు.

గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు లక్షలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోందని, అయిన కాంగ్రెస్ పాలకులకు రిజర్వాయర్ లు నింపాలనే ఆలోచన చేయడం లేదని విమర్శించారు.. సముద్రంలోకి వెళ్లే ఆ నీటిని కాలువల ద్వారా చెరువులు నింపే అవకాశం ఉందని గుర్తుం చేశారు. . కానీ ఈ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లు వస్తాయన్న సమాచారం ఉందని తెలిపారు. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు.

మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో వర్షాభావం కారణంగా కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపాలన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు కూడా ఖాళీగా ఉందని.. ఆ రిజర్వాయర్ సహా దాని కింద ఉన్న చెరువులు నింపాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

కృష్ణా నది నీటిని కిందికి వదిలి సముద్రం పాలు చేస్తున్నారని.. కాళేశ్వరం మోటర్లతో నీటిని ఎత్తిపోసి సూర్యాపేట వరకు నీటిని తీసుకురావాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు అని కాంగ్రెస్ నేతలు అన్నారని.. మరి ఎస్సారెస్పీ నుంచి ఎందుకు సూర్యాపేటకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై బద్నాం చేస్తున్నారని. రైతులకు నీళ్లు ఇవ్వలేక నిందను, నెపాన్ని కాళేశ్వరంపైకి నెట్టేస్తున్నారని సీరియస్ అయ్యారు. సుందిళ్ల, అన్నారం ద్వారా ఎల్లంపల్లి నింపాలని కోరారు. తద్వారా వరంగల్, సూర్యాపేటకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయండి.. గంగుల

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లె తెరచి కన్నెపల్లి నుంచి వెంటనే నీటిని లిప్ట్ చేయాలని డిమాండ్ చేశారు మరో మంత్రి గుంగుల కమలాకర్ .. ఎల్లంపల్లి నుంచి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే రాగా, మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదన్నారు.. వరద వస్తేనే నీటిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని అయితే గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు..

ఎస్సారెస్పీ నుంచి నీళ్లు రావని,. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయరని అంటూ దీనివల్ల పలు జిల్లాల్లో తాగునీరు, సాగు నీరుకు అటు రైతులు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గంగుల పేర్కొన్నారు.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సాకు చూపుతూ నీటిని లిఫ్ట్ చేయకుండా తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోయేలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement