పెద్దపల్లి, ఆగస్టు 25 (ప్రభన్యూస్): సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలుస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో గూలాబీ గూటిలో చేరగా, ఎమ్మెల్యే దాసరి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతిపక్ష పార్టీల నుంచి పద్ద ఎత్తున గులాబీ గూటికి చేరుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లోనూ మూడోసారి గులాబీ జెండా ఎగరడ ఖాయమన్నారు.
పార్టీలో చేరిన వారిలో చుక్క చంద్రయ్య, లింగయ్య, కొత్తూరి రాజయ్య, కల్వల ఓదెలు, కొత్తూరి శ్రీనివాస్, జంగం శ్రీనివాస్, కల్వల స్వామి, ముదురు కోళ్ల గణష్, కల్వల మురళి, గౌరవెల్లి రామారావు, గాట్ల కృష్ణ, శంకర్, ఆవుల కిషన్, రాజు, ఆర్కుటి పోచాలు, ఎనగందుల కనకయ్య, చొప్పరి లక్ష్మయ్య, గట్టయ్య, సదయ్య, సత్యపాల్, కల్వల అరవింద్, ఎల్లయ్య, తిరుపతి, రాము, మల్లయ్య, చంద్రయ్య, అక్షిత్, చుక్క రమేష్‌లు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సమితి జిల్లా కో ఆర్డినేటర్ కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు, ఏఎంసీ ఛైర్మెన్ బుర్ర మౌనిక శ్రీనివాస్, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ బోయిని రాజమల్లయ్య, మాజీ ఎంపీపీ పాల రామారావు, వైస్ ఛైర్మెన్ అన్నేడి మహిపాల్ రెడ్డి, సర్పంచ్ ఎరుకొండ రమేష్, ఎంపీటీ-సీ సంపత్, గ్రామ శాఖ అధ్యక్షుడు భూమయ్య, చుక్క రాజమౌళి, మొండయ్య, నారాయణ, తిరుపతి, రాజేశం, శ్రావణ్, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.