Tuesday, September 17, 2024

TG: దేశానికే తలమానికం తెలంగాణ.. గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో శరవేగంతో అభివృద్ధి చెందుతూ దేశంలోనే తలమానికంగా ఉంటున్నదని తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం 78వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకావిష్కరణ గావించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం మాట్లాడుతూ… ప్రజల చెంతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి ప్రభుత్వం ప్రకటించిన అభయహస్త్, ఆరు గ్యారంటిల పథకాలకు అమలు చేస్తూ ఆదర్శనంగా నిలుస్తుందన్నారు. అన్ని రంగాల్లో యాదాద్రి జిల్లాను అగ్రగామిగా నిలపాలని, మహనీయుల స్ఫూర్తితో కలసి కట్టుగా పనిచేసి, అంకితమై శ్రమిస్తూ సర్వతోముఖభివృద్ధికి పాటుపడాలన్నారు. ఆయా శాఖల శకటాలను ప్రదర్శించారు. ఆయా పాఠశాల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య, జెండా ఆవిష్కరించగా, భువనగిరిలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న), కలెక్టర్ హనుమంతు కె జెండగే, డీసీపీ రాజేష్ చంద్ర,అదనపు కలెక్టర్లు బెన్ షాలోమ్, గంగాధర్, మున్సిపల్ చైర్మెన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయా శాఖల స్టాల్స్ ను పరిశీలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement