ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి,అన్ని రంగాల అభివృద్ధికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారిందని తెలిపారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి దిక్సూచిగా తయారైందన్నారు. గతేడాది ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం 67 వేల787 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 93వేల489కోట్లు ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. అందరికి పరిశుద్ధమైన తాగునీళ్లు అందుతున్నాయన్న మంత్రి కొప్పుల.. కోటిన్నర ఎకరాలకు సాగునీళ్లు పుష్కలంగా అందిస్తున్నామని చెప్పారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతున్నారు. చేపలు, గొర్రెలు,కోళ్ల పెంపకం బాగా పెరిగిందని చెప్పారు. అందరికి మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.వెయ్యి గురుకులాల ద్వారా ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఐటి,ఫార్మా,రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్,ఏరోస్పేస్ రంగాలు మరింత దూసుకుపోతున్నాయని, తలసరి ఆదాయంలో అగ్రభాగాన నిలిచామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement