Tuesday, November 26, 2024

ఫార్మాకు కేరాఫ్ తెలంగాణ.. ఇన్వెస్ట్ చేస్తున్న ఫారిన్ కంపెనీలు

హెదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: కొవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఫార్మా రంగ బూమ్‌లో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరం ప్రముఖ పాత్రపోషిస్తోంది. పలురకాల ఔషధాలు, వాటి ముడి పదార్ధాల తయారీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి భారీగా పెట్టుబడులు భాగ్యనగరానికి తరలివస్తున్నాయి. బల్క్‌డ్రగ్‌, ఫార్ములేషన్‌, బయోలాజిక్స్‌ అన్ని పెట్టుబడులకు భాగ్యనగరం కేరాఫ్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు నేరుగా స్థానిక కంపెనీలను కొనుగోలు చేయడంతో పాటు ప్రైవేట్‌ ఈక్విటీ, ఇతర ఫండ్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టి ఇక్కడి కంపెనీలలో సింహభాగం వాటాలను సొంతం చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. తెలంగాణలో ఉన్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెెస్‌ పరిస్థితులతో పాటు ఇప్పటికే ఇక్కడ ఉన్న ఫార్మారంగ ఇకోసిస్టమ్‌ కారణంగానే భారీ పెట్టు బడులు తరలి వస్తున్నట్లు పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

దీనికి తోడు కరోనా కారణంగా పపంచ వ్యాప్తంగా ఔషధాల తయారీ రంగం, దానికి అవసర మైన ముడిపదార్ధాల తయారీ, సప్లయ్‌ చైన్‌లలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడమే బూమ్‌కు కారణంగా చెబుతున్నారు. దేశంలో తయారవుతున్న ఔషధాలకు కావల్సిన 70శాతం వరకు ముడిపదార్ధాలకు (ఏపీఐ) ఇప్పటికీ చైనా మీదే ఆధారపడుతుండడంతో ఫార్మా కంపెనీలన్నీ కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో సొంతగా తయారీకి సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌ ఫార్మారంగానికి తిరిగి మంచి రోజులొచ్చాయన్న విషయం ఇటీవల స్టాక్‌ మార్కెట్‌లో భారీగా పెరిగిన స్థానిక ఫార్మాకంపెనీల షేర్లే నిదర్శనమని చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement