ప్రాథమిక వైద్యం నుండి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు తెలంగాణలో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు మంత్రి హరీశ్ రావు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా ఉండేది కాదు.. ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా డయాలసిస్ పేషెంట్లకు ఉచిత బస్సు పాసు, పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు.100కు 63 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతున్నాయి.కెసిఆర్ కిట్టు తో పాటు గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నాం ..ఈ సంవత్సరము కామారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజ్ ప్రారంభమవుతుంది.
ఇప్పుడు వైద్యం కోసం హైదరాబాద్ కి పోవాల్సిన అవసరం లేకుండా కామారెడ్డి లోనే సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజ్ ప్రారంభం కాబోతుంది.తెలంగాణలో గిరిజనులకు 10% రిజర్వేషన్ వల్ల పేద గిరిజన విద్యార్థులకు వైద్య విద్య నేర్చుకునే అవకాశం దొరుకుతుంది.బి కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్ 80% ఇవ్వడం వల్ల స్థానిక విద్యార్థులకు వైద్య విద్య చదువుకునే అవకాశం దొరుకుతుంది. దేశంలో తెలంగాణ వైద్య ఆరోగ్య రంగంలో మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉంచేందుకు అందరం కృషి చేస్తున్నాం.ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తున్నాం.స్థానిక ఎమ్మెల్యే సురేందర్ కృషి వల్ల పట్టుదల వల్ల ఈరోజు ఎల్లారెడ్డికి వంద పడకల ఆసుపత్రి మంజూరై శంకుస్థాపన చేసుకోగలిగాం.జూన్ 24 నుంచి పోడు భూములకు పట్టాలు అందించబోతున్నాం.పోడు భూములకు పట్టాలతో పాటు రైతుబంధు, రైతు బీమా కూడా అందించబోతున్నాం.అన్ని రకాల వైద్య సదుపాయాలతో నూతన ఆసుపత్రి నిర్మించబోతున్నాం.