Friday, September 13, 2024

Telangana అంత‌టా హైడ్రా విస్త‌ర‌ణ‌ … మంత్రి పొన్నం

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆక్ర‌మ‌ణ‌లు
ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో వివ‌రాల సేక‌ర‌ణ‌
హైడ్రా చ‌ర్య‌ల‌కు ప్ర‌జామోదం ఉంది
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : హైడ్రా చ‌ర్య‌ల‌కు ప్ర‌జామోదం ఉంద‌ని, ఈ త‌ర‌హా చ‌ర్య‌లు రాష్ట్ర‌మంత‌టా విస్త‌రిస్తామ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. తెలంగాణ అంత‌టా చెరువులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయ‌ని చెప్పారు. సోమ‌వారం ఇక్క‌డ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వాటి వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. ఇందుకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన చెరువుల వివ‌రాల‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని కోరారు. హైదరాబాద్‎ పరిధిలో హైడ్రా చేపట్టిన చ‌ర్య‌ల‌ను ప్ర‌జ‌లంతా ఆమోదిస్తున్నార‌న్నారు.

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌
తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పరిరక్షించుకోవాలని ధ్యేయంతో ప్ర‌భుత్వం ఉంద‌ని మంత్రి పొన్నం అన్నారు. గ‌తంలో ఎక్కడ చెరువులు ఉన్నాయో స్వచ్ఛంద సంస్థలకు, స్థానికుల‌కు తెలుస్తాయ‌ని, ఎవరైనా పోలీసు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. చెరువుల పరిరక్షణ స్థానికులదేనని అన్నారు. ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు లేదని తేల్చి చెప్పారు.

వివ‌రాలు ఇవ్వ‌డంతో ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి
ఎవరికైనా అన్యాయం జరిగిందంటే కోర్టులు ఉన్నాయని, వాటిని ఆశ్ర‌యించ వ‌చ్చున‌ని మంత్రి పొన్నం అన్నారు. చెరువుల, ఎక్కడిక‌క్కడ అక్రమణకు గురయ్యాయో వాటి ఆధారాలు సంబంధిత అధికారులకు ఇవ్వాలని సూచించారు . ప్రజలంతా ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం కావాలని ఆయ‌న కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement