జైలు అధికారులు విచారణలో ఉన్న ఖైదీల హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ చేసిన ఫిర్యాదును తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్వీకరించింది. ఫిర్యాదుపై విచారణకు డైరెక్టర్ జనరల్ అఫ్ ప్రిసన్(prisons), తెలంగాణ వారికి ఆదేశాలు జారీ చేసింది. తన నియంత్రణలో ఉన్న అన్ని జైళ్ల సూపరింటెండెంట్లందరికీ తగిన సూచనలను జారీ చేయమని, భవిష్యత్తులో ఫిర్యాదుదారు ఆరోపించిన లోపాలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. అలాగే వారి అధీన అధికారులు మానవ హక్కులకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చేలా చూడాలని, భవిష్యత్తులో విచారణ ఖైదీల మానవ హక్కులను ఉల్లంఘనలు జరుగకూడదని ఆదేశించారు. అట్టి చేర్య రెండు నెలల్లోగా జరపాలని స్పష్టం చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement