Friday, November 22, 2024

మా ఆదేశాలంటే లెక్క లేదా? నిర్మల్ కలెక్టర్ పై హైకోర్టు ఆగ్రహం

నిర్మల్ లో చెరువుల్లో ఆక్రమణలపై తొలగింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తి చేసింది. వీడియో కాన్ఫెరన్స్ విచారణకు కలెక్టర, మున్సిపల్ కమిషనర్ హాజరైయ్యారు. కబ్జాలు తొలగించాలని ఆదేశించి ఆరు నెలలైనా ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఐదు చెరువుల్లో ఆక్రమణలను 80 శాతం తొలగించినట్లు కలెక్టర్ కోర్టుకు తెలిపారు. మిగతా ఆక్రమణలు తొలగించేందుకు నెల రోజులు గడువు కోరారు. కరోనా తీవ్రత, భైంసా అల్లర్లు తదితర కారణాల వల్ల పూర్తి చేయలేకపోయామని కలెక్టర్ వివరించారు. చెరువుల చుట్టూ కంచె ఏర్పాటు పనులు 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. చెరువుల పరిరక్షణ కమిటీలను కొనసాగించాలని కలెక్టర్ కు హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణలు తొలగించడంతో పాటు.. మళ్లీ కబ్జా కాకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. వరద కాలువల ఆక్రమణలు తొలగించి.. చెరువులకు కలపాలని ఆదేశించింది. పూర్తి స్థాయి బ్లూప్రింట్ సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ విచారణ జులై 29కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement