తెలంగాణలో లాక్ డౌన్ సమయంలో న్యాయవాదులను అడ్డుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో లాయర్లను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. న్యాయవాదులను ఆపకూడదని సూచించింది. బార్ కౌన్సిల్ కార్డులను చూపించే లాయర్లను అనుమతించాలని ఆదేశించింది. న్యాయవాదులు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే వారి స్టెనోలు, క్లర్కులను కూడా అనుమతించాలని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే న్యాయవాదులను కూడా అడ్డుకోకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తింపు కార్డులను చూపించినా అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. తమ సూచనల మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీని ఆదేశించింది. ఇదే సమయంలో న్యాయవాదులు, క్లర్కులు, స్టెనోలకు కూడా సూచనలు జారీ చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను దుర్వినియోగం చేయవద్దని హైకోర్టు హెచ్చరించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement