వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వంపై కేసు మరోసారి వాయిదా పడింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం హైకోర్టు విచారణ జరిగింది. అయితే, చెన్నమనేని తరఫు న్యాయవాది ప్రత్యక్ష విచారణ కోరారు. అయితే, దీనిపై కాలయాపన చేస్తున్నారన్న పిటిషినర్ ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదించారు. స్టే ఉన్నందున కాలయాపన ఎత్తుగడలు వేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో 2 వారాల తర్వాత ప్రత్యక్ష విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా, ఈ కేసులో ఇప్పటికే కేంద్రం తన వాదనలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే అని తేల్చి చెప్పగా, తనను అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ బలంగా వాదిస్తున్నారు. దీంతో ఈ కేసును ప్రత్యక్షంగా వినాలని చెన్నమనేని కోర్టును కోరారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా కేసును ప్రత్యక్షంగా విని నిర్ణయం తీసుకోవాలని కోరడంతో రెండు వారాల తర్వాత కేసును ప్రత్యక్షంగా వినేందుకు హైకోర్టు అంగీకరించింది.
ఇది కూడా చదవండి: MAA Elections: మంచు విష్ణు ప్యానల్ ఇదే..