హైదరాబాద్ నగరలోని ఖానామెట్ భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఖానామెట్‌లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఖనామెట్‌లో గొల్డెన్ మైల్‌లోని 15 ఎకరాలను వేలం వేశారు. అయితే, 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం కూడా ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టగా.. ఆ స్మశానవాటిక వేలాన్ని ఆపాలంటూ హైకోర్టును స్థానికులు ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులు అక్కడే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాము సెంటిమెంట్‌గా భావించే సమాధులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తాత్కలికంగా స్మశాన వేలాన్ని నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, నిన్న జరిగిన ఈ భూముల వేలంలో ప్రభుత్వానికి దాదాపు రూ.730 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: నేటి నుంచి అయ్యప్ప భక్తులకు స్వామి దర్శనం