Tuesday, November 26, 2024

మరియమ్మకు ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్‌ ఏంటి?: హైకోర్టు

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పీఎస్‌లో మరియమ్మ లాకప్‌ డెత్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా కోర్టుకు ఏజీ తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మరియమ్మ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని వివరించారు. ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్‌పైన అఫిడవిట్ ధాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు2కు వాయిదా వేసింది.

కాగా, మరియమ్మ లాకప్ డెత్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం లాకప్ డేత్ పై జ్యుడీషియల్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఓ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సస్పెండ్ చేశారు. ఏసీపీని హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. గత విచారణలో జ్యుడీషియల్ ఎంక్వయిరీకి హైకోర్టు ఆదేశించింది.

ఇది కూడా చదవండి: ఫ్లాష్ న్యూస్: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్?

Advertisement

తాజా వార్తలు

Advertisement