Saturday, November 23, 2024

మల్లన్న బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శ‌ర్మ‌ను బెదిరించార‌న్న‌ కేసులో అరెస్ట్ అయిన తీన్మార్ మల్లన్న బెయిల్ రిట్‌ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. మల్లన్న భార్య మత్తమ్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మల్లన్నను అక్రమంగా అరెస్ట్‌ చేశారని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన 306, 511 సెక్షన్లు తొలగించాలని పిటిషనర్ కోరారు. అయితే, కింది కోర్టులో బెయిల్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ సెప్టెంబర్ 14కి వాయిదా వేసింది.

కాగా, జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శ‌ర్మ‌ను డబ్బుల కోసం బెదిరించార‌న్న‌ ఆరోప‌ణ‌ల‌తో తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు ఆగస్ట్ 27న రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను సికింద్రాబాద్ సివిల్ కోర్టులో ఆయనను హాజరుపరచగా.. సెప్టెంబర్‌ 9వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. అదే సమయంలో మల్లన్న బెయిల్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పరువు తీసేది ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement