Friday, November 22, 2024

ఆ రూ.58 కోట్ల విడుద‌ల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన జీవో 208పై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ జీవోపై దాఖ‌లైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మ‌రోసారి విచారించిన హైకోర్టు.. చివ‌రికి రూ. 58 కోట్ల విడుద‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తొలుత జీవోను స‌వ‌రించి తీసుకురావాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. ఏజీ ప్రసాద్ అభ్య‌ర్థ‌న మేర‌కు సీఎస్ సోమేష్ కుమార్ స‌మర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకుంది.

జీవో నేపథ్యాన్ని అఫిడవిట్‌లో సీఎస్ వివరించార‌ని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భూసేకరణ పరిహారం చెల్లింపుల కోసమే రూ.58 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆఫిడ‌విట్‌పై సంతృప్తి వ్య‌క్తం చేసిన హైకోర్టు.. ఏజీ అభ్యర్థనతో నిధుల విడుదలపై స్టే ఎత్తివేసింది. రూ.58కోట్లు విడుదల చేయవద్దన్న ఆదేశాలను ఉపసంహరించుకుంది. ఈమేర‌కు లెక్చరర్ ప్రభాకర్ దాఖ‌లు చేసిన‌ పిల్ పై విచారణ ముగిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement