Friday, November 22, 2024

తెలంగాణలోని కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో ని కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కోర్టుల్లో రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది మాత్రమే కోర్టులకు హాజరవుతున్నారు. ఈ నెల 19 నుంచి కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. ఇక నుంచి సిబ్బంది మొత్తం విధులకు హాజరుకావాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు, హైకోర్టులో ఈ నెల 31 వరకు ఆన్‌లైన్ విధానమే కొనసాగనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.

ఇది కూడా చదవండి: రూ.41 వేల కోట్లకు లెక్కలున్నాయి: పయ్యావులకు బుగ్గన కౌంటర్

Advertisement

తాజా వార్తలు

Advertisement