Sunday, November 17, 2024

Telangana – ముసురులో జంట నగరాలు ….

హైదరాబాద్‌ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, బంజారాహిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంలో వర్షం కురుస్తోంది.

పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. వర్షం కారణంగా అక్కడక్కడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ (శనివారం) మేఘావృతమై ఉండే అవకాశం ఉంది..

- Advertisement -

అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్.. భారత్కు ఐఎండీ అలర్ట్..దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

.నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నందున అక్టోబర్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. , సెప్టెంబర్ మరియు అక్టోబర్లలో రుతుపవనాల వర్షాలు లా నినా వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. రుతుపవనాల తిరోగమన సమయంలో లా నినా అభివృద్ధి చెందితే, అది ముగియడానికి చాలా సమయం పడుతుంది.

ఫిలిప్ క్యాపిటల్ ఇండియా కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అశ్విని బన్సోద్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 3-4 వారాలు , అక్టోబర్ ప్రారంభంలో భారీ వర్షాలు కురిస్తే ఇప్పటికే చేతికి వచ్చిన పంటలకు , పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు.

.Israeli Strike : గాజాలో వైద్య సహాయం తీసుకువెళుతున్న కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి

Advertisement

తాజా వార్తలు

Advertisement