Monday, November 18, 2024

Exclusive | తెలంగాణకు ఇద్ద‌రు జ‌డ్జిలు, సీజేగా జ‌స్టిల్ అలోక్ కుమార్‌ రాక

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ కుమార్‌ అరాధే నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన‌ సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్రానికి సిఫారసు చేసింది. కాగా, ఇవ్వాల (బుధవారం) కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో న్యాయశాఖ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో పాటు గుజరాత్, కేరళ, ఒడిశా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు నియామ‌కం అయ్యారు.

తెలంగాణ హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ సామ్‌ కోషి..
తెలంగాణ హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ సామ్‌ కోషిని బదిలీ చేస్తూ కేంద్రం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులో పని చేస్తున్నారు. త‌న‌ను అక్కడి నుంచి బదిలీ చేయాలని స్వయంగా సుప్రీంకోర్టు కొలీజియానికి ఆయ‌న విజ్ఞప్తి చేశారు. అయితే, మొదట ఆయనను మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించగా.. మధ్యప్రదేశ్‌ మినహా మరో కోర్టుకైనా బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు ఆయనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement