హైదరాబాద్ – ప్రజా పాలన అంటివి.. సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బర్ అంటివి.. ప్రతి రోజు ప్రజలు కలుస్తా అంటివి.. కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చేటేస్తివి అని రేవంత్ రెడ్డిని బిఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి, లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు… సీఎం, మంత్రుల పేషీలు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే దగ్గర ఉండేలా, సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా, దాన్ని కాదని మంత్రులు, అధికారులను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నవు ఎందుకు అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని, జూబ్లీ హిల్స్ ప్యాలెస్‌లో ఉంటున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు విమర్శించారు. మంత్రులు, అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకొని, అహంభావం ప్రదర్శిస్తున్నవని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు.