సవాళ్లు,ప్రతిసవాళ్లతో దద్దరిల్లిన సభ
అప్పులుపై చర్చకు సిద్దమన్న హరీశ్ రావు
ఏడాదిలోనే రూ1 లక్ష 27 వేల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం
తాము చేసింది 51 వేల కోట్ల చేశామన్న భట్టి
భట్టిపై ప్రివిలేజ్ మోషన్.. చర్చ జరగాలని హరీశ్ పట్టు
హైదరాబాద్ – శాసనసభలో రాష్ట్ర అప్పులు, ఎఫ్ ఆర్ ఎం బి రుణ పరిమితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బిఆర్ఎస్ మాజీ ఆర్థిక మంత్రి మధ్య వాడీవేడి చర్చ సాగింది.. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు.. నేడు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అప్పుల వివరాలను సభలో ప్రకటించారు. 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.51,200 కోట్లు అని వెల్లడించారు.
ఇప్పటికే రూ.1లక్ష 27 వేల కోట్ల అప్పు
దీనికి అడ్డు తగిలిన హరీశ్ రావు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలోనే రూ.1.27 వేల కోట్ల అప్పు చేసిందని ఫైర్ అయ్యారు. ఈ లెక్కన రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం రూ.6.36 వేల కోట్ల అప్పు చేయబోతోందని అన్నారు. అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందనేది పూర్తిగా అవాస్తవని ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారు.ప్రస్తుతం రాష్ట్రానికి రూ.4.47 లక్షల కోట్ల అప్పు ఉంటే.. రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టుగా చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే తాము రాష్ట్ర అప్పులపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని స్పష్టం చేశారు. అయితే, తాము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్లపై ఈ సమావేశాల్లోనే చర్చ పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
అధికారం కోల్పొయినా మార్పు రాలేదు
అయితే, ఆ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఏ మాత్రం మార్పు రాలేదని.. సభలు వాస్తవాలు మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. అప్పుల పూర్తి లెక్కలను తాము స్పష్టంగా వివరించి చెప్పామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఫైర్ అయ్యారు. పైగా చేసిన అప్పులను దాచేసి.. తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన అప్పులు దాచడమే కాకుండా.. తిరిగి తమపైకి మాటల దాడికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు భట్టి చేసిందంతా చేసి తమపైనే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని ధ్వజమెత్తారు.
సభను బీఆర్ఎస్ పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇంకెన్నాళ్లు ప్రజలను ఏమార్చుతారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ లో చర్చ జరగాలనే తాము శ్వేతపత్రం విడుదల చేశామని అన్నారు. రాష్ట్ర అప్పులపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అప్పులపై సభలో చర్చకు భట్టి చేసిన సవాలును తాము స్వీకరిస్తున్నామని.. చర్చకు సిద్ధమని హరీశ్ రావు ప్రకటించారు.
సభాపతికి గౌరవం ఇవ్వడంలా..
తనకు హరీశ్ రావు మీదర చాలా గౌరవం ఉందని.. కానీ, అలాంటి వ్యక్తి సభ అన్న.. సభాపతి అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు భట్టి. బీఏసీలో సమావేశం నుంచి వాకౌట్ చేయాల్సిన అవసరం ఏముందని హరీశ్ రావును ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం పోయాక బీఆర్ఎస్ పార్టీకి మతిపోయిందిన భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. గడిచిన పదేళ్లలో బీఏసీ సమావేశం ఎలా నిర్వహించారో మర్చిపోయారా అంటూ చురకలంటించారు. గతంతో పాటించిన నిబంధనలే తాము ఇప్పుడు పాటించాలి కదా అని సెటైర్లు వేశారు. సభలో కూడా ఎవరైనా రూల్ బుక్ ప్రకారమే నడుచుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
దీనికి హరీశ్ రావు సమాధానం ఇస్తూ బిఎసి లో చర్చించకుండా ఏ బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టకూడదంటూ రూల్ ను చదివి వినిపించారు.. ఇదే విషయాన్ని బిఎసిలో తాను ప్రస్తావిస్తే తనను ఓవర్ లుక్ చేశారన్నారు.. గతంలో ఎన్నడూ బిఎసి నిర్ణయాలకు వ్యతిరేకంగా సభలో ప్రవర్తించలేదన్నారు హరీశ్ రావు .