Saturday, October 5, 2024

BREAKING: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల

తెలంగాణలో ఉద్యోగార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఫైనల్‌ కీతో పాటు ప్రిలిమ్స్‌ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

TGPSC Group 1 Results డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. అలాగే.. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) వెల్లడించింది. ఇక.. అక్టోబర్‌ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఆ పరీక్షకు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు విడుదల చేస్తామని తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement