దళితులను వ్యాపారులుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకరవ్గంలో అమలు చేయనున్నారు. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ దళిత బంధు పథకం అమలు కానుంది. ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించనున్నారు. కాగా, ఈ పథకాన్ని ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అమలు చేశారు. వాసాలమర్రి దళితుల కోసం ఈ పథకం కింద రూ. 7.60 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: హుజురాబాద్ బైపోల్.. కాంగ్రెస్ కు సెంటిమెంట్ ఫియర్!