Friday, November 22, 2024

Telangana – ‘టెట్’ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ లో 3 లక్షల మంది అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. త్వరలో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వీలైనంత ఎక్కువ మంది డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని సర్కార్ చూస్తోంది

ఇదిలా ఉంటే.. తెలంగాణలో మెగా డీఎస్సీ (TS DSC 2024) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. మరోవైపు.. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. కాగా.. తెలంణలో హైదరాబాద్‌లో 878 అత్యధిక ఖాళీలు ఉండగా.. నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అయితే వాటిని భర్తీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement