కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీరు తరలించకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నీటి తరలింపును నిలువరించాలని కోరింది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు తరలించారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిచింది. హంద్రీనీవా ద్వారా ఏపీ 9.28 టీఎంసీలు నీరు తరలించిందని పేర్కొంది. 1976 ఒప్పందం ప్రకారం ఏపీ 34 టీఎంసీల లోపే తీసుకోవాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: ఏపీలో భారీ స్కామ్.. సీఎంఆర్ఎఫ్ నిధులు గోలమాల్..