హరిద్వార్ లో జరిగిన కుంభమేళాలో తెలంగాణ నుంచి హాజరైన వారు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 1 నుంచి 17 వరకు రాష్ట్రం నుంచి కుంభమేళాకు హాజరైన వాళ్లు తప్పక క్వారంటైన్లో ఉండాలని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకూ దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇంట్లోనూ మాస్క్ ధరించాలని సూచించారు. జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ.. తప్పక కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement