హైదరాబాద్ – తెలంగాణలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి..ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కొత్తగా మరికొన్ని అంబులెన్స్ లు రేపటి నుంచి అందుబాటులోకి తీసుకానుంది.. మొత్తం అత్యవసర వైద్య సేవల కోసం కొత్తగా 466 వాహనాలను సమకూరుస్తున్నారు.. వాటిలో 204 సాధారణ అంబులెన్సులు, కాగా మరో 228 అమ్మఒడి రవాణకు వినియోగించనున్నారు..ఇక పార్దివ దేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు 34 అంబులెన్స్ లను కేటాయించారు.. అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ కొత్త వాహనాల రాకతో ప్రజలకు మరింత వేగంగా, విస్తృతంగా అందనున్న వైద్యసేవలు అందనున్నాయి… రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఈ కొత్త వాహనాలు ప్రజలకు సేవలు అందించనున్నాయి.
అత్యవసర వైద్య సేవలు మరింత విస్తృతం…రేపటి నుంచి అందుబాటులో కొత్తగా 466 అంబులెన్స్ లు
Advertisement
తాజా వార్తలు
Advertisement