Wednesday, October 30, 2024

Telangana – ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్

హైదరాబాద్‌: దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.అక్టోబర్ 26న కేబినెట్ భేటీలో ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదలకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీపావళి పండుగ వేళ పెండింగ్‌‎లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

👉పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి వర్తింపు

👉డిసెంబర్ 1న చెల్లించే నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపు

👉2022 జులై 1 నుంచి ఈనెల వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ

- Advertisement -

👉సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ

👉సీపీఎస్ ఉద్యోగులకు మిగతా 90 శాతం 17 వాయిదాల్లో చెల్లింపు

👉సీపీఎస్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపులు

👉జీపీఎఫ్ ఖాతాలు లేని పుల్టైం కంటింజెంట్ ఉద్యోగులకు 17 వాయిదాల్లో చెల్లింపు

👉కంటింజెంట్ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపులు

👉రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలు 2025 జనవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement