Friday, November 22, 2024

Telangana – స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్‌ – ఉచిత డిగ్రీతో పాటు ఉద్యోగం ఆఫ‌ర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల (టీఎంఆర్‌ఈఐఎస్‌)కు చెందిన ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా డిగ్రీ కోర్సుతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్లు కార్యదర్శి ఆయేషా ఖాన్‌ తెలిపారు. టీఎంఆర్‌ఈఐఎస్‌, ఎంఎస్‌ఎన్‌ లేబరేటరీస్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఫార్మా టెక్నాలజీ, ఎంఎల్టి బ్రిడ్జి కోర్సు ద్వారా 2023లో ఇంటర్‌ పాసైన లేదా మార్చి 2024లో రాయనున్న అభ్యర్థులు అర్హులు. 55శాతం ఉత్తీర్ణతా మార్కులు కలిగి ఉన్న 20 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులుగా తెలిపారు.

క్యాంప‌స్ సెల‌క్ష‌న్స్‌..

ఈ నెల 21న టీఎంఆర్‌జే కరీంనగర్‌ బాలికలు-2, కరీంనగర్‌ బస్టాండ్‌ సమీపంలో, 22న టీఎంఆర్‌ వొకేషనల్‌ జూనియర్‌ కాలేజీ నిజామాబాద్‌ బాలురు-4, నిజామాబాద్‌ ధర్మారం, 23న టీఎంఆర్‌ జూనియర్‌ కాలేజీ నిర్మల్‌ బాలురు-1, ఆర్టీఓ కార్యాలయం చించోలి సమీపంలో గల కేంద్రాల వద్ద క్యాంపస్‌ సెలక్షన్‌ జరగనుంది. ఎంపికైన విద్యార్థులకు రూ.11వేల నెలసరి జీతం, తొలి రెండు సంవత్సరాలు రాయితీతో కూడిన వసతి సౌకర్యం, ఉచిత రవాణ సదుపాయం, తొలి రోజు నుంచి కంపనీ చట్టాలకు అనుగుణంగా అభ్యర్థులు ఉండటంతో పాటు, ఎంపకైన అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులకు ఈఎస్‌ఐ సౌకర్యం ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement