Monday, November 25, 2024

TS: ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు… పాల్గొన్న మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

(ప్రభ న్యూస్ ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో) : రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని హుడా కాలనీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేర్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కే దక్కిందన్నారు. దశాబ్దిలో శతాబ్దకాల అభివృద్ధిని చేసుకొని, అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా నిలిపిందన్నారు. తొమ్మిదేళ్ళ కాలంలో వ్యవసాయాన్ని పండుగ చేసిందనీ, విద్యుత్ రంగాన్ని, విద్యా రంగాన్ని ఆదర్శంగా నిలిపిందన్నారు.

వైద్య రంగాన్ని అగ్రస్థానానికి చేర్చించిన ఘనత కేసీఆర్ కే చెల్లిందని పేర్కొన్నారు. పెట్టుబడులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిందనీ
కరువుల బాధలు లేకుండా వలసలు వాపస్ తెచ్చి పంట పొలాలను సస్యశ్యామలం చేసిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభ్యుత్వానికే దక్కిందని సబితారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement