Tuesday, November 26, 2024

Telangana Fight – వ్యూహాత్మ‌క పోరు – ర‌స‌వ‌త్త‌ర తీరు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కడమే కాదు.. వ్యూహాత్మకమూ అవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ కార్యక్రమాలు జోరందుకున్నాయి. నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. కర్నాటక ఫలితాలతో ఆవహించిన నిరాశ, నిస్పృహలతో కమల నాథులు గత కొన్ని వారాలుగా స్తబ్ధుగా మారిపోయినట్లు తాజా పరిస్థితు లు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ క్రియాశీలక కార్యక్రమాల్లో వేగం తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే, ఈ స్తబ్ధు పరిస్థితిని ఛేదించేందుకు తాజాగా చర్యలు ప్రారంభమయ్యాయి. పార్టీ శ్రేణుల్లో మళ్ళీ ఉత్సాహాన్ని నింపేందుకు అగ్రనాయకత్వం తెలంగాణకు తరలి వస్తోం ది. జూన్‌ 15 నుంచి 30 మధ్య వారం రోజుల వ్యవధిలో బీజేపీ అగ్ర నేతలు నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. వీరి పర్యటన తెలం గాణ బీజేపీలో జోష్‌ పెంచి తిరిగి బరిలోకి తెచ్చే అవకాశాలు న్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక తెలం గాణాలో ప్రత్యామ్నాయం మేమేనంటూ కాంగ్రెస్‌ నేతలు తమ ప్రతాపాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అగ్ర నేత రాహుల్‌ గాంధీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్ళివచ్చారు. అయితేనేం ఇక్కడ తెరమీద సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వంటి వారు.. తెర వెనుక రాహుల్‌ రహస్య బృందం పరిస్థితిని చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. గత కొద్ది నెలలుగా పాదయాత్ర నిర్వహిస్తున్న భట్టి.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నారు. సమాజంలో మెజారిటీ వర్గమైన 68 లక్షల రైతు కుటుంబాలతో ముడిపెట్టుకుని ఉన్న అంశం కావడంతో వారి మద్దతు కూడగట్టుకోవడం కోసం బీఆర్‌ ఎస్‌ ప్రయత్నిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ధరణి విషయంలో ఏకంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడాల్సి వచ్చింది. ఇక తెరవెనుక పావులు కదుపుతున్న రాహుల్‌ గాంధీ రహస్య బృందం పార్టీలోకి ఎవరెవరిని చేర్చుకోవాలనే అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఆ ఇద్దరి విషయంలో కాంగ్రెస్‌ సక్సెస్‌
చాలా కాలంగా ఇద్దరు తెలంగాణ నేతలు ఏ పార్టీలో చేరతారా అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపి, కోట్లకు పడగలెత్తిన కాంట్రాక్టర్‌ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న విషయం తాజాగా ఒక కొలిక్కి వచ్చినట్లు- కనిపిస్తోంది. వీరిద్దరిని చేర్చుకునేందుకు అటు- బీజేపీ, ఇటు- కాంగ్రెస్‌ యధాశక్తి ప్రయత్నించినప్పటికీ చివరికి రాహుల్‌ రహస్య బృందంతో జరిపిన సమాలోచనలే ఫలితమిచ్చినట్లు- బోధపడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం ఖరారైంది. జూన్‌ 15 తర్వాత ఎప్పుడైనా వీరిద్దరు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు- తెలుస్తోంది.

ఉమ్మడి ఖమ్మం అత్యంత కీలకం!
తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని 10 సీట్లపై కన్నేసింది. గతంలో ఇక్కడ పాదయాత్ర చేసిన రేవంత్‌ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించండి.. రాష్ట్రవ్యాప్తంగా వంద సీట్లు- దాటేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేస్తామంటూ భీషణ ప్రతిఙ్ఞ చేశారు. ఆయన చేసిన ప్రకటన సాక్షాత్కారం కావాలంటే ప్రస్తుత నాయకత్వ బలిమికి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కలవడం అనివార్యమని కాంగ్రెస్‌ నాయకత్వం గుర్తించింది. దానికి అనుగుణంగా పావులు కదిపింది. వీరి ప్రయత్నాలకు కర్నాటక ఫలితాలు కూడా తోడవడంతో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపారు.

రంగంలోకి కేటీఆర్‌
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రధాన పార్టీలు ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నీ తానై రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఒక్కరిని కూడా అసెంబ్లీ మెట్లక్కనీయబోనని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేసిన ప్రకటన జిల్లాల్లో కలకలం రేపింది. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ధీటు-గా స్పందించారు. పొంగులేటి తన వాపును చూసి బలుపు అనుకుంటు-న్నారంటూ పరోక్షంగా హెచ్చరించారు. పొంగులేటి ఎక్కడ్నించి పోటీ- చేసినా ఓడిస్తామని పువ్వాడ సవాల్‌ కూడా చేశారు. వీరి సవాళ్ళు ఎలా వున్నప్పటికీ.. పువ్వాడ మాటల్లో ఒకటి స్పష్టంగా కనిపించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు- స్పష్టమవుతోంది. తెలంగాణాలో అన్ని చోట్ల రెండు ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబట్టు-కున్నా ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దగా ఏమీ సాధించలేదు. అయితే ఈసారి దాన్ని తిరగరాయాలని బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. ఆ బాధ్యతలను ప్రస్తుతానికి మంత్రి పువ్వాడ చూస్తున్నా.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు-, మంత్రి కేటీ- రామారావు ఖమ్మం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే, తుమ్మలకు పాలేరు సీటిచ్చే విషయంలో బీఆర్‌ఎస్‌ అధినాయకత్వానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ సీటు-లో గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచిన కందాల ఉపేందర్‌ రెడ్డి ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్‌ అని పదేపదే చెప్పుకుంటు-న్నారు. ఈక్రమంలో తుమ్మలను ఎలా బుజ్జగిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.

- Advertisement -

బీజేపీలో ఊహించని పరిణామాలు
నామమాత్రపు బలమున్న భాజపా కూడా ఖమ్మం జిల్లాలో ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నిస్తూ పావులు కదుపుతోంది. ఇందుకోసం పొంగులేటిని చేర్చుకోవడం ఉత్తమమని భావించి దాదాపు ఆరు నెలల పాటు- ఆయన్ను చేర్చుకోవడంపై కమలనాథులు దృష్టి పెట్టారు. కానీ ఆయన చివరికి కాంగ్రెస్‌ పార్టీవైపు మొగ్గుచూపుతున్నట్లు- బోధపడిన తర్వాత చేరికల కమిటీ- కన్వీనర్‌గా వున్న ఈటల రాజేందర్‌ నైరాశ్యపు మాటలు మాట్లాడారు. రాజేందర్‌ మాటలు పార్టీలో కలకలం రేపాయి. కర్నాటక ఫలితాలు తమ ఆకర్ష స్కీమ్‌కు గండికొట్టాయన్న కంక్లూజన్‌కి వచ్చిన బీజేపీ నేతలు కొంతకాలంగా స్తబ్ధుగా మారిపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కోలుకోలేమని అనుకున్నారేమో ప్లాన్‌ ‘బీ’కి తెరలేపారు కమలనాథులు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ ఓటు- బ్యాంకును కలిగి వున్న చంద్రబాబుకు కబురు పెట్టి మరీ ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపారు. మంతనాల సారాంశమేమిటో ఇరు పార్టీలు అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఈ రెండు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాలలో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయన్న ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇక మునుగడ అసాధ్యం అనుకుంటు-న్న తరుణంలోను ఖమ్మం జిల్లా ఓటర్లు టీ-డీపీ పక్షాన నిలబడ్డారు. టీ-డీపీకి అండగా నిలిచే సామాజిక వర్గం ఓటర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద సంఖ్యలోనే వున్నారు. వీరిని దగ్గర చేసుకునేందుకు చంద్రబాబుతో చేతులు కలిపే దిశగా బీజేపీ అగ్రనాయకత్వం అడుగులు పడుతున్నట్లు- తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement