హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు .చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.. ఇక్కడ 9 వారాలపాటు జరిగే బోనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది రెండు తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని బోనాలను సమర్పిస్తారు. . ఇప్పటికే వేలాది మంది భక్తులు తరలి వచ్చారు
కాగా, ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి పూజకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు బోర్డు వారికి పట్టువస్ర్తాలను లంగర్‌హౌస్ చౌరస్తాలో అందజేయనున్నారు .
ట్రాఫిక్ ఆంక్షలు
ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు గోల్కొండకు వచ్చే రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. బోనాల పూజ కార్యక్రమాలు ఈనెల 22, 25, 29, జూలై 2, 6, 9, 13, 16, 20వ తేదీల్లో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా రాందేవ్‌గూడ నుంచి మక్కీ దర్వాజ మీదుగా గోల్కొండ కోట, లంగర్‌హౌస్ నుంచి ఫతేదర్వాజా మీదుగా గోల్కొండ, సెవెన్ టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వచ్చే రూట్లలో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు