రుణ మాఫీ అందలేదని నిరసనలు
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు
తలమడుగు మండలంలో పాడెకట్టి శవయాత్రం
డప్పు చప్పుళ్లతో ఊరంతా ఊరేగింపు
500 మందికి పైగా పాల్గొన్న రైతులు
కరీంనగర్ జిల్లా మొలంగూర్‌లో బ్యాంకు ముందు రైతుల ధర్నా
జగిత్యాల జిల్లాలో రైతుల ధర్నా
సిద్దిపేట జిల్లాలో రోడ్డుపై భైటాయింపు
ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తామన్న ₹ 2 లక్షల రుణమాఫీ నగదు రైతుల ఖాతాలో జమ కాకపోవడంపై రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 51 వేల కుటుంబాలకు రుణమాఫీ పథకం అమలు కాగా, మూడో విడతలు తమ పేర్లు లేకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. దీంతో అదిలాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన బాటపట్టారు.
. తలమడుగు మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించి, అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం దిష్టిబొమ్మ పాడెకట్టి డప్పు చప్పుళ్లతో ఊరంతా శవయాత్ర నిర్వహించారు. 500 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఆదిలాబాద్, జైనథ్ బేల తాంసి మండలాల రైతులు రెవెన్యూ వ్యవసాయ అధికారులను కలిసి తమగోడు వెళ్ళబోసుకున్నారు. ప్రతి ఊరిలో 50శాతానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని, ప్రభుత్వం తమను మోసం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారుల ముందు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ద రైతులకు మొండి చేయి చూపారని నిరసన చేపట్టిన రైతులు అన్నారు.
కరీంనగర్‌లో ఆందోళనలు..
ఆంధ్రప్రభ స్మార్ట్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ ఇండియన్ బ్యాంక్ ఎదుట రుణమాఫీ వర్తించని రైతులు ఆందోళన చేపట్టారు. బ్యాంకు షెటర్ మూయించి ధర్నాకు దిగారు. తమ రుణాలు మాఫీ చేయాలంటూ అధికారులతో రైతుల వాగ్వాదానికి దిగారు. దీంతో బ్యాంకు మేనేజర్ రైతులకు సర్దిచెప్పడంతో శాంతించారు. అలాగే జగిత్యాల జిల్లా, సిద్ధిపేట జిల్లాల్లో కూడా రైతులు ఆందోళన చేపట్టారు.