Monday, November 25, 2024

త‌గ్గేదేలే…గ‌ళం విప్పుతున్న భూ నిర్వాశితులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతున్న వేళ, ఊపందుకుంటున్న భూ నిర్వా సితుల ఉద్యమాలు తెలంగాణ ప్రభుత్వానికి చిక్కుముడిలా మారుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా వివిధ ప్రాజెక్టులకు సేకరించిన లక్షన్నర ఎరకాలకు సంబం ధించిన నిర్వాసితుల సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కార మయ్యే అవకాశమే కనిపించడం లేదు. అనేక డిమాండ్లతో, భారీ ఆర్థిక వనరులతో ఈ సమస్య ముడిపెట్టుకుని ఉంది. అదే సమయంలో వెనక్కి తగ్గేదేలేంటూ రైతు ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. కామారెడ్డి, జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ల ఉపసంహరణ పర్యవసానం… రాష్ట్రంలో భూ నిర్వాసితులంతా ఒక్కసారిగా నిద్రలేచారు. ప్రతియేటా భూముల ధరలు అంచనాకు మించి పెరిగిపోతుండడం, అనేక ప్రాంతాల్లో వ్యవసాయ భూములను కోల్పోయిన రైతులు నిత్య కూలీలుగా మారడం తదితర పరిణామాలు నిర్వాసితులను పోరాటంవైపు నెడుతున్నాయి. తమ భూములకు పాత అవార్డును అమలు చేయాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం మాకొద్దని, ఇప్పుడున్న మార్కెట్‌ విలువలకు అనుగుణంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్లకు కుప్పలుతెప్పలుగా వినతులు అందుతున్నాయి. ఈ ఉద్యమం రాజకీయ రంగు పులు ముకునే అవకాశమూ లేకపోలేదని నిపుణులంటున్నారు.

అసలే, ఎన్నికల ఏడాది.. తెలంగాణ సర్కారుపై పోరాటానికి విపక్షాలు ఉవ్విల్లూరుతున్నాయి. ఈ క్రయంలో రకరకాల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు గడిచిన ఎనిమిదేళ్ళలో ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూములను సమీకరించాల్సి వచ్చింది. దాదాపు అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనను అదునుగా చేసుకుంటూ ప్రభుత్వంపై పోరాడాలని ప్రధాన పార్టీల నాయకులు నిర్ణయించారు. వాస్తవానికి రైతులు, నిర్వా సితుల ఆందోళన న్యాయమైనదే అయినప్పటికీ, వారి ఉద్య మాలకు రాజకీయ రంగు పడుతుండడంతో సకాలంతో ప్రభుత్వం నుంచి స్పందన రావడంలేదు.
అనేక సందర్భాల్లో రాజకీయ నాయకుల మద్దతుతో కొన సాగుతున్న నిర్వాసితుల ఉద్యమాలపై ఉన్నతాధికారులు కూడా ఎలాంటి హామీని ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కాళేవ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన అనేక బ్యారేజీలకు వేల ఎకరాల భూములను సమీకరించారు. ఈ క్రమంతో భూములు కోల్పోయిన రైతుల్లో దాదాపు 60 శాతం మందికి రకరకాల కారణాల వల్ల పరిహారం అందలేదు. ప్రస్తుతం వీరంగా ఉద్య మ దారి పట్టారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వందలాది ఎకరాల మా భూములు కోల్పోయాం.. నష్టపరిహారం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటిదాకా మాకు చిల్లిగవ్వా చెల్లించ లేదు. అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్‌తో కలిసి చేసుకున్న ఒప్పందం ఇప్పటిదాకా నెరవేర్చలేదు’ అని స్థానిక రైతు నిర్వాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్ర బార్డర్‌లోనూ కొన్ని వందల ఎకరాల భూములను అక్కడి రైతులు కోల్పోవలసి వచ్చింది.

న్యాయం చేయాలంటూ భూ నిర్వాసితుల దీక్ష
యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద బీఎన్‌-తిమ్మాపూర్‌ రైతులు, భూ నిర్వాసితులు దీక్ష చేస్తున్నారు. పలు ప్రాజెక్టుల కోసం తీసుకున్న తమ భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఇండ్లు, స్థలాలు కోల్పో తున్న వారందరికీ 250 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మా ణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, గ్రామ సర్వేలో పాల్గొ న్న కుటు-ంబంలోని ప్రతి సభ్యుడుకి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని, జీవనాపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారందరికీ ప్యాకేజీని వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తు న్నారు. ఇదే అంశంపై కలెక్టర్‌ ముందు నిరసన కార్యక్రమాలు, దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇటు సంగారెడ్డి జిల్లా జహీరాబా ద్‌లోని నివ్జ్‌ు భూ నిర్వాసితులు కూడా ఉద్యమబాట పట్టారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రకరకాల నిరసన కార్య క్రమాలకు సిద్ధమవుతున్నారు. న్యాయమైన పరిహారం అందేంత వరకూ పోరాడి తీరుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
పెరిగిన భూముల ధరల నేపథ్యంలో 2013 భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కాల్సిందేనని బాధిత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరాకు కేవలం రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పడాన్ని నిర్వాసిత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ విలువ ప్రతి ఎకరానికి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతుందని వారంటున్నారు. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ ఐదు జిల్లాలతో ముడిపెట్టుకుని ఉన్న రిజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూ సేకరణ ప్రక్రియ కూడా మరో కొత్తతరహా ఉద్యమానికి దారితీస్తోంది. అనేకమంది రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే భూములను సర్వే చేస్తుండడాన్ని వ్యవతిరేకిస్తూ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఆర్‌అండ్‌బీ, హెచ్‌ఎండీఏ అధికారులను అనేక గ్రామాల్లో తరిమికొట్టారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా మార్కండేయ ప్రాజెక్టు నిర్వాసితులు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తే తమపై పోలీసులు కేసులు పెడుతున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

భూమికి భూమి.. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాల్సిందే..!
భూమికి భూమి ఇవ్వాల్సిందే, లేదంటే ఎకరానికి ఐదు కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆర్‌ఆర్‌ఆర్‌ భూ బాధితులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం గిర్మాపూర్‌ వద్ద 65జాతీయ రహదారి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటు-ప్పల్‌ వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ ఏర్పాటు-పై నిత్యం ఆందోళనలు కొనసాగుతున్నాయి. చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించిన అధికారులపై బాదితులు తిరగబడడ్‌రు. పోలీసు ఆంక్షల మద్య సాగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వీరారెడ్డి, డీఎస్పీ రవీందర్‌రెడ్డి తదితరులున్నారు. నిరసనలు, ధర్నాలు, బహిష్కరణల మధ్య ఏకాభిప్రాయం లేకుండానే పలుసార్లు సమావేశాలు ముగిశాయి. 65, 161వ నంబర్‌ జాతీయ రహదారి విస్తరణతో పాటు- సింగూరు కాళేశ్వరం కాలువల ఏర్పాటు- హై-టె-న్షన్‌ విద్యుత్‌ టవర్ల ఏర్పాటు- వల్ల వేలాది ఎకరాల కొద్దీ పంట భూములు కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వంశ పారపర్యంగా వస్తున్న అరకొర భూములను ఆర్‌ఆర్‌ఆర్‌లో కోల్పోవడంతో తాము బతికేదెలా అంటూ వారంతా గత్యంతరంలేని పరిస్థితుల్లో ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్దమవుతున్నారు.

- Advertisement -

ఆర్‌ఆర్‌ఆర్‌ను అడ్డుకుంటాం
రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభం కానివ్వబోమని స్థానిక నిర్వాసిత రైతులు హెచ్చరిస్తున్నారు. తమ భూములను స్వాధీన పరుచుకునేం దుకు వచ్చే అధికిరులను అడ్డుకుంటామన్నారు. గత కొద్దినెల లుగా భూ బాధిత రైతులంతా సంఘటితమై ఆర్‌ఆర్‌ఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇప్పటికే కాళెశ్వరం కాలువ కోసం భూమిని కోల్పోయామని, తాజాగా జాతీయ రహదా రికి అవసరమైన భూమిని ఇవ్వాలంటూ, అధికారులు నోటీ-సులు అందజేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక తాము ఏమి సాగు చేసుకోవాలంటూ హత్నూర మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేవులపల్లి మీదుగా ఉన్న రహదారిని హత్నూర మీదుగా అలైన్‌మెంట్‌ మార్చాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement